జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. లాక్‌డౌన్‌ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది.
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి.
కొత్త మార్గదర్శకాలు
- జూన్ 30 వరుకు కరోనా నిబంధనలు అమలు
- రాత్రి 9గంటల నుంచి 5 గంటల వరకు కర్ప్యూ
- కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పొడగింపు
- విద్యాసంస్థలు తెరవడంపై జూలైలో నిర్ణయం
- జూన్ 8 నుంచి ఆలయాలకు అనుమతి
- జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెన్
- మెట్రో, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు
- లాక్ డౌన్ 5.0లో సినిమా హాళ్లకు అనుమతి నిరాకరణ
- కంటోన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్ డౌన్
- ప్రయాణాలకు, సరుకు రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేవు