ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోస‌మే : విజ‌య‌సార‌ధి

త‌మ ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల ప‌క్ష‌మే నిల‌బ‌డి పోరాడుతామ‌ని మ‌హ‌బూబాబాద్ సిపిఐ జిల్లా కార్య‌ద‌ర్శి బి.విజ‌య‌సార‌ధి అన్నారు. ప్ర‌భుత్వం విచాక్ష‌ణ ర‌హితంగా పేద ప్ర‌జ‌ల పొట్టకొడితే త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. జిల్లాలోని అయోధ్య, ముడుపుగల్ గ్రామాల్లో ని రైతుల భూములు 600 ఎకరాల ను అక్రమంగా ప్రభుత్వం, రెవెన్యూ వారు లాక్కోవడానికి ఈరోజు సర్వే చేయ‌డం స‌రికాద‌న్నారు. ఈ స‌ర్వే నిర్వహిస్తుంటే అడ్డుకున్న రైతులు, సిపిఐ పార్టీ భారీ రాస్తారోకో చేప‌ట్టింది. ప్ర‌ధాన ర‌హాదారిపై ఆందోళన చేపట్టారు. ఆందోళన వద్దకు చేరుకున్న పోలీసులు, ఎమ్మార్వో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని రైతుల తరుపున అధికారులతో జిల్లా కార్యదర్శి బి.విజయసారది మాట్లాడారు. కాగా ప్ర‌జ‌లు చేప‌ట్టిన ఆందోళ‌న చూసి అధికారులు వెనుదిగిరి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్,పాండురంగాచారి, తండ సందీప్, చింతకుంట్ల వెంకన్న, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, రైతులు పాల్గొన్నారు.