చేగుంట, పాపన్నపేటలో కరోన కలకలం
మెదక్ జిల్లాలో మరోసారి కరోన కలకలం రేగింది. వైరస్ వ్యాపిస్తున్న మెదటి రోజుల్లో డిల్లీ వెళ్లి వచ్చిన వారికి కరోన పాజిటివ్ రావడంలో గట్టి చర్యలు తీసుకుని వారిని కోలుకునేలా చేశారు. మరోసారి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ రావడంలో జిల్లా వాసులు ఉల్కిపడుతున్నారు.
చేగుంటలోని ఓ కండక్టర్కి, పాపన్నపేటలో నాలుగేళ్ల బాలుడికి కరోన సోకడంతో వారిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయా చుట్టూ పక్కల ఉన్నవారినికి హోం క్వారంటైన్ కి తరలించారు. రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం…. తాజాగా జిల్లాలో రెండు కొత్త కేసులు నమోదు కావడం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ప్రజలకు. ప్రభుత్వం మరిన్ని టెస్ట్లు చేస్తే ఇంకా ఎంత మందికి కరోనా బయటపడుతుందో అనేది ఇప్పుడు ప్రశార్థకంగా మారింది.