తెలంగాణలో భయపెడుతున్న కరోన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కేసులు మరింతగా అంతకు అంతా రెట్టింపు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 650గా ఉంది. ఈరోజు కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మంది, మేడ్చల్ జిల్లా నుంచి 6, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ్‌పేట నుంచి ఒక్కొక్కరు ఉండగా.. వలసదారులు 12 మంది, విదేశాల నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నేటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలు 3 ఉన్నాయని, 14 రోజులుగా పాజిటివ్ కేసులు లేని జిల్లాలు 21 ఉన్నాయని ఆయన వెల్లడించారు.