తీరుమారని స్పా సెంటర్లు
కరోనా లాక్ డౌన్ లో భాగంగా ఇచ్చిన సడలింపులను హైదరాబాద్‌లోని పలు స్పా సెంటర్లు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటీవల పలు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయినా స్పా సెంటర్లలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజేషన్ వంటి వసతులు ఎక్కడా కనిపించడం లేదు. ఇక మసాజ్ చేసే థెరపీలు అయితే అసలు మాస్క్‌లే ధరించడం లేదు. హైదరాబాద్‌లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి మొన్న మాదాపూర్‌లోని స్టార్ బ్యూటీ సెలూన్ స్పా తో పాటు నగరంలోని మరికొన్ని స్పాలపై పోలీసులు దాడులు చేశారు. అయినా కస్టమర్లను ఆకర్షిస్తూ పలు స్పాలు అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతునే ఉన్నాయి. ఈ అంశాలపై పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం అందుతుండగా… మరి కొన్ని స్పాలపై త్వరలో దాడులు చేసి సీజ్ అవకాశం కనిపిస్తోంది.