కూచన్‌పల్లిలో యువతి అదృశ్యం
మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లిలో యువతి అదృశ్యమైంది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కూకట్ల మౌనిక (21) ఈ నెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అన్నారు. మౌనిక తండ్రి బయ్యన్న ఫిర్యాధు మూరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రేమ వ్యవహారమా ఇంకా ఏమైన కారాణాలు ఉన్నయో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.











