దాని కోసమే కేసీఆర్ ఆరాటం : కాంగ్రెస్
నిధులను దారి మల్లించి తన ఖాజనా నింపుకోవడానికికే కాళేశ్వరం మీద కేసీఆర్ అమితమైన ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనాలోచితంగా, తప్పుడు నిర్ణయాలతో ముందు కెళ్తోందని ఆరోపించారు. నీళ్లను సాకుగా చూపి అడ్డుగోలుగా నిధులు ఎత్తిపోస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నిధులివ్వకుండా ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా అందించగల గోదావరి, కృష్ణా జలాలను వదిలిపెట్టి ఎత్తిపోతలకే ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టేందుకే కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల వద్ద దీక్షలకు దిగనున్నామన్న ఉత్తమ్ అన్నారు.











