స‌ర్పంచ్ భ‌ర్తపై లైంగిక వేధింపుల కేసు

గ్రామాల్లో భార్య స‌ర్పంచ్ అయితే భ‌ర్త‌దే పెత్త‌నం. ఆ పెత్త‌నం ఉప‌యోగించి చివ‌రికి పోలీసుల‌కు చిక్కాడు ఓ ఘ‌నుడు. వివ‌రాల్లోకి వెళ్తే… అక్క‌న్నపేట మండ‌లం గోవ‌ర్థ‌న‌గిరి గ్రామ స‌ర్పంచ్ భ‌ర్త రాములుపై ఏఎన్ఎం వ‌న‌జ ఇచ్చిన ఫిర్యాధుతో కేసు న‌మోదు చేసిన‌ట్లు స్థానిక పోలీసులు వెల్ల‌డించారు. ఏఎస్ఐ మ‌ణేమ్మ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రేగొండ గ్రామంలో స‌బ్ సెంట‌ర్‌లో సెకండ్ ఏఎన్ఎంగా విధులు నిర్వ‌హిస్తున్న వ‌న‌జ‌పై స‌ర్పంచ్ భ‌ర్త రాములు గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా లైంగిక వేధిస్తున్నార‌ని… నిత్యం త‌న‌కు ఫోన్ చేయాల‌ని వ‌న‌జ‌ను ఇబ్బంది పెడుతున్న‌ట్లు తెలిపారు.