భార్యభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..

పెళ్లి ఇది ఒక పెద్ద బాధ్య‌త‌. సంసారం సాగ‌రం అన్నారు పెద్ద‌లు. ఆ సాగార‌న్ని ఇదాలంటే ఎన్నో క‌ష్టాలు.. ఆ క‌ష్టాల‌ను ఇష్టాలుగా చేసుకుంటునే సాగ‌రంలోని భార్య‌, భ‌ర్త‌ల ప‌డ‌వ స‌జావుగా ముందుకు సాగుతుంది. ఆ ప్ర‌యాణంలో దొరికిన స‌మ‌యంలో భార్య మీద ప్రేమ చూపిస్తూ మార్కులు కొట్టేయండి.
-. రోజులో ఎక్కవ సమయం మీరు ఇష్టపడే వారితో గడపండి. బంధం బలపడడానికి అన్నింటికంటే ఇదే ముఖ్యం.
-. వారిని వారి ఇష్టాలను గౌరవించండి. మీ ఇద్దరూ కలిసి కలిసి ఉన్నంత మాత్రాన మీ ఇష్టప్రకారం వారు మారాలని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు…
-. వారికి కాస్తా స్వేచ్ఛ ఇవ్వండి. ఫ్రెండ్స్ తో వారిని ఎంజాయ్ చేయనివ్వండి.
-. ప్రేమలో గౌరవం కలిసి ఉండకూడదని ఎక్కడా లేదు. మీ సంభాషణల్లో వారికిచ్చే గౌరవాన్ని ఇవ్వండి.
-. ఎదుటివారు మీకెంత ముఖ్యమో చెబుతూ ఉండండి- మాటలతో, చేతలతోనూ కూడా.
-. ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేయండి. ఇలాంటి ఐడియాస్ ఇంటర్నెట్‌లో బోలెడు ఉంటాయి. వాటి హెల్ప్ ద్వారా చక్కని ఐడియాస్ వస్తాయి.
-. వారికి ఇష్టమైన వంట చేయండి.
-. మీ ఇద్దరూ కలిసి ఉన్న ఓ పాత ఫోటోని ఫ్రేం కట్టించి వారికి గిఫ్ట్ గా ఇవ్వండి.
-. రెగ్యులర్ గా చిన్న చిన్న మెసేజెస్ పెడుతూ ఉండండి.
-. ఎప్పటికప్పుడు ఎదుటివారిని ఆశ్చర్యపరచండి..
-. మీరు చేసే పనుల్లో వారి సలహా అడగండి.
-. వీకెండ్స్ లో ఇద్దరూ కలిసి వంట చేయండి.
-. రెగ్యులర్ గా వెకేషన్స్ ప్లాన్ చేసుకోండి.
-. ఎదుటివారి హాబీస్ లో మీరూ ఉత్సాహంగా పాల్గొనండి.
-. పిల్లలు పక్కన లేనప్పుడు దగ్గరగా ఉండండి.
-. ఖాళీ ఉన్నప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించండి.
-. కలిసి నవ్వుకోండి. జోక్ అవ్వచ్చు, సీరియల్ అవ్వొచ్చు – ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయండి.
-. బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడల్లా ఆయన బ్రీఫ్ కేస్ లో కొన్ని లవ్ నోట్స్ దాచండి.
-. కలిసి పనులు చేస్తుండండి..
-. రాత్రి భోజనం ఇద్దరూ కలిసే చేయాలనే నియమం పెట్టుకోండి.
-. రోజు ఎలా గడిచిందో కలిసి ఆ విషయాలను పంచుకోండి.
-. మీ కోసం తయారైనప్పుడు ఆ విషయాన్ని మెచ్చుకోండి.
-. పెద్ద పెద్ద నిర్ణయాల్లో వారి మాటలకి విలువివ్వండి.
-. బాగా అలిసిపోయి ఇంటికొచ్చినప్పుడు ఒక మంచి మసాజ్ ఇవ్వండి.
-. వారికి ఇష్టమైన పనులు చేయండి.. కలిసి పనులు పంచుకోండి.. బట్టలు ఇస్త్రీ చేసి పెట్టండి.
-. పొద్దున్న ఆయన ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సాయం చేసుకోండి.
-. రెగ్యులర్ గా ‘ఐ లవ్ యూ’ అని మెసేజెస్ పెడుతూ ఉండండి.
-. ఇంట్లో ఏమైనా మార్పులు చేస్తుంటే ఎదుటివారి ఇష్టాఇష్టాలు గుర్తుపెట్టుకోండి.
-. వీక్నెస్ లు మర్చిపోయి, బలాల మీద ఫోకస్ చెయ్యండి.
-. పిల్లల ధ్యాసలో పడి ఒకరినొకరు పట్టించుకోవడం మర్చిపోకండి. మీకు ఇద్దరూ ముఖ్యులే.
-. అలిసిపోయి ఇంటికి వచ్చిన తరువాత మీ మాటలతో ఎదుటివారిని సేద తీర్చండి.
-. ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండండి..
-. వారాంతంలో మీ ఇద్దరూ కలిసి ఏదైనా టీవీ షో చూడడానికి ప్లాన్ చెయ్యండి.
-. పెద్ద పెద్ద కొనుగోళ్ళలో ప్రతి ఒక్క విషయంలో ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించండి.
-. మూడ్ బాలేకపోతే విసిగించకండి. వారేు వచ్చి తన ప్రాబ్లంస్ మీతో చెప్పుకుంటారు.

  • పార్క్ కి వెళ్ళినా, మాల్ కి వెళ్ళినా ఎదుటివారి చేతులు పట్టుకుని నడవండి.
  • మీ ఇద్దరూ కలిసి మార్నింగ్ వాక్ వెళ్ళచ్చేమో చూడండి. అది అన్నివిధాలా మంచిది.
  • నెలకోసారైనా డేట్ ప్లాన్ చెయ్యండి.
  • ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడూ, ఇంట్లోకి వస్తున్నపుడూ ఒక హగ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి.
  • ఇంట్లో ఆయన చేసే పనులని మెచ్చుకోండి.
  • ఒక ప్రేమలేఖ వారికి కనిపించేలా పెట్టండి.
  • వారు ఎంత బాగా చూసుకుంటున్నారో వారికి తెలియజేయండి.
  • అనుకున్నది జరగనప్పుడు వారికి సపోర్ట్ ఇవ్వండి.
  • ఇద్దరూ కలిసి ఒక కొత్త డిష్ ట్రై చెయ్యండి.
  • మొత్తంగా ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయండి..