చందంపేట ఎంఎస్ఎన్ ఫార్మ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోనని ఎంఎస్ఎన్ ఫార్మ కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆ కంపెనీ నుండి విడుదలవుతున్న గ్యాస్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. కంపెనీని మూసి వేయాలని గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటనలను కూడా ఉన్నాయి. గత మూడు నాలుగు రోజుల క్రితం ఆ కంపెనీలలోని వియర్ హౌస్ విభాగంలో… ఆక్మత్తుగా విష రసయాణాలు వెలుబడ్డాయి. దీంతో అక్కడ పని చేస్తున్న 13 ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఎక్కడ కూడా బయటలకు తెలియనీయకుండా వారికి చికిత్ప అందించారని సమాచారం. కాగా ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి ఆదివారం బాధితులనను పరామర్శించారు. అయితే ఈ విషయంపై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా విష వాయువులు బయటకు వస్తుడంతో అనేక ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు అంత పెద్ద ప్రమాదం జరిగతే గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం వారికి ఎందుకు వైద్యం చేపిస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు ఎలాంటి రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జరిగన ఎల్జీమర్ గ్యాస్ ఘటన మరవకముందే… తెలంగాణలో ఇలాంటి ఘటన చోటు చేసుకోడం , వారికి చాటుగా వైద్యం అందించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.