ఘట్‌కేసర్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో…
కరోనా లాక్ డౌన్ వల్ల ఎంతో మంది వలస కూలీలు పడారని ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులను మనం చూస్తున్నం. రాత్రి పగలు తేడా లేకుండా వలస కూలీలు రాష్ట్రాలు దాటి వెళ్లిపోతున్నారు. కనీసం వారికి నీళ్లు, అన్నం దొరకడం కూడా కష్టంగా ఉంది. గత కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో తెలంగాణ నుండి ఎంతో మంది వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా నగర శివారులలోని ఘట్‌కసర్ రైల్వే స్టేషన్ నుండి నిత్యం వేలాది మంది తరలివెళ్తున్నారు. దీంంతో ఆ ప్రాంతం అంతా రద్దీగా మారింంది. అయినా కానీ తినడానికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి వారి కష్టాలను చూసి చలించిపోయిన భజరంగ్ దళ్ బృందం నిత్యం వారికి అల్పహారం, మధ్యాహ్నా, రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. మేడ్చల్ జిల్లా భజరంగ్‌దళ్ కో కన్వీనర్ పి.చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా ఈ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం దాదాపు 3500 మందికి పైగా భోజన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే 8 రైలు వలస కూలీలను తీసుకొని వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే వారికి భోజన వసతులు చేశామన్నారు. నిత్యం బృందం సభ్యులు స్వచ్ఛదంగా పాల్గొంటున్నామని సభ్యులు తెలిపారు. వలసకూలీలకు సేవ చేయడం ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన బాధ్యత అని తెలిపారు.