ఏడాది పాల‌న‌లో ఒరిగింది ఏంలేదు : ‌కాట్ర‌గ‌డ్డ‌

ఏడాదిలో ఆంధ్ర్రప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందుల పాలు జేశార‌ని మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన విమర్షించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏంతో ముందుచూపుతో రాజ‌ధాని అమ‌రావతిగా నిర్ణ‌యించారు. కానీ ఏమాత్రం అవ‌గాహాన లేకుండా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ జ‌నాల్ని న‌ట్టేట ముంచాడ‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాజ‌ధానుల మీద స్ప‌ష్ట‌మైన వైఖ‌రి వెల్ల‌డించ‌లేద‌న్నారు. ప్రపంచంలో ఎక్క‌డ లేని విధంగా ఇక్క‌డ మూడు రాజ‌ధాన‌లు అంటూ కొత్త డ్రామాకు తెరలేపార‌ని ఆరోపించారు. క‌రోన లాక్ డౌన్ స‌మ‌యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా అదుపులో పెట్టుకోలేని సీఎంగా మిగిలార‌ని అన్నారు. క‌నీసం ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌నే సోయి కూడా లేద‌న్నారు. రాష్ట్రానికి ఏడాదిలో ఏం చేశారో… ఎంత అభివృద్ధి చేశారో శ్వేత ప్ర‌తం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.
విశాఖ‌ప‌ట్నంలో ఎల్జీమ‌ర్ గ్యాస్ ఘ‌ట‌న‌లో సొంత పార్టీ పెద్ద‌ల‌ను కాపాడుకోవ‌డానికి చ‌నిపోయిన కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు ఇచ్చి నోరు యూయించార‌ని మండిప‌డ్డారు. ఒక మంత్రుల స్థాయిలో ఉండి కూడా విప‌క్షాల మీద చెప్ప‌లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ద‌య్య‌బ‌ట్టారు. ఏడాది పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారని ఎవ‌రూ కూడా సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు.