ఈ నిర్లక్ష్యానికి ఎవరు భాద్యులు ?
అసలే ఎండాకాలం కాసింత నీడ దొరికితే చాలు అనుకుంటాం. కానీ ఆ నీడనే ఓ ఆభాగ్యుడి ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి అయి పూర్తిగా కాలిపోయంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం చింతపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొలం పనులు నిమిత్తం కేషవేని సంపత్ తన ద్విచక్ర వాహనం పై పొలం వద్దకు వెళ్ళాడు. తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టు కింద నిత్యం బండి పెట్టి వెళ్ళవాడు. ఈ రోజు కూడా అలాగే వెళ్ళాడు కానీ మల్లి వచ్చి చూసే సరికి తన బండి పూర్తిగా కాలిపోయిన సంఘటన చూసి నివ్వరు పోయాడు. ఆ పక్కనే ఉన్న గడ్డి వాము కూడా పూర్తిగా దగ్ధంమైనది. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణం తెలియడం లేదు. ఇటీవల వారి కోతలు అవడంతో ఈ చెట్టు పక్కన పొలం ఉన్నయజమాని వారి గడ్డి కాల్చడం వల్ల జరిగిన ప్రమాదమా లేక ప్రభుత్వం నిర్లక్ష్యం తో విద్యుత్తు తీగలు వల్ల జరిగిన ప్రమాదం చోటు చేసుకున్న ఘటన అనేది తెలియడం లేదు. పొలంలో తాను వారి గడ్డి అంటించలేదు అని ఆ పొలం యజమాని చెపుతున్నాడు విద్యుత్తు సరఫరా తీగలు ఒకదానికి ఒకటి తగిలి ప్రమాదం జరిగింది అని చెబుతున్నాడు. ఈ నిర్లక్ష్యం కారణం పొలం యజమాని లేదా ప్రభుత్వమా అనేది ఇప్పుడు ప్రశ్నర్థకంగా మారింది. తనని ప్రభుత్వం ఆదుకోవాలని కేషవేని సంపత్ కోరుతున్నాడు.