కరోనా వార్డులోకి బికనీ డ్రెస్ లో నర్సు
కరోనా వైరస్ మనకి మరో వింత సంఘటనని చూపించింది. ఆ సంఘటన విశేషాలు మీరు కూడా తెలుసుకుంటే నివ్వెర పోతారు.
ప్రపంచమంతా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుండటంతో రోగులను రక్షించడానికి వైద్యులతోపాటు నర్సులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండ్లకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు రోగులకు సేవలు అందిస్తున్నారు. అయితే రష్యాకు చెందిన ఒక నర్సు చేసిన పని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ‘హాట్’ టాపిక్‌గా మారింది.
రష్యాలోని టులా నగరానికి చెందిన ఒక ఆస్పత్రిలో ఓ 20 ఏండ్ల యువతి నర్సుగా సేవలు అందిస్తున్నది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ఆస్పత్రి యాజమాన్యం పీపీఈ కిట్లను అందజేసింది. అయితే అందరూ తమ దుస్తులపైనే పీపీఈ కిట్లను ధరించినా.. ఆ 20 ఏండ్ల నర్సుకు మాత్రం తన దుస్తులపై నుంచి పీపీఈ కిట్ ధరించడం కష్టంగా అనిపించింది.
ఉక్కపోతగా ఉందంటూ డ్రెస్సును పక్కన పడేసి కేవలం లోదుస్తులను మాత్రమే ఉంచుకుని, వాటిపై పీపీఈ కిట్‌ను ధరించింది. అయితే పీపీఈ కిట్ నుంచి తన శరీరం క్లియర్‌గా బయటకు కనిపిస్తున్నా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే వేషధారణతో వార్డువార్డుకు తిరుగుతూ కరోనా రోగులకు సేవలు అందించింది. ఆమె నిర్ణయానికి ఆస్పత్రి యాజమాన్యం కూడా అడ్డు చెప్పలేదు.
అయితే, నర్సు వేషధారణకు బిత్తరపోయిన ఓ కరోనా పేషెంట్ మాత్రం ఆమెను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం దారుణమంటూ తిట్టి పోస్తున్నారు. ఈ విషయం ఆ దేశ ఆరోగ్య శాఖ చెవిన కూడా పడటంతో సదరు నర్సుపై క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలకు ఆదేశించింది.