భయాందోళనలో ఘట్కేసర్

కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నా…. నగర శివారులోని ఘట్కేసర్ మాత్రం భయం గుప్పిటిలో ఉంది. లాక్ డౌన్ వల్ల నగరంలోని వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు అని… కేంద్రం ఇచ్చిన సడలింపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. వారి కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం చేసే పనిని అందరు మెచ్చుకున్నారు. వలస కూలీలను పంపించాడని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువ అయితే కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే ఆలోచనలో నగర శివారు ప్రాంతం అయినా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ ని ఎంచుకున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కరోనా వైరస్ అంటూ వ్యాధి అని అందరికి తెలుసు… మరో వైపు ఆ వ్యాధి లక్షణాలు గతంలో కంటే ఇప్పుడు దాదాపు 28 రోజుల తరువాత కానీ బయటపడం లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు సమస్య ఎక్కడ అంటే… మొదట రాత్రి సమయంలో హైదరాబాద్ నుండి ఘట్కేసర్ వరకు ప్రజా రవాణా బస్సుల ద్వారా వారిని ఈ రైల్వే స్టేషన్ కి తీసుకవచ్చేవారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో వందలాది మంది వలస కూలీలు ఇక్కడికి చేరుకుంటున్నారు.

అసలు సమస్య ఏమిటంటే కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పట్టణంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాలైన దుకాణాలు తెరుస్తున్నారు. దీనితో పట్టణం సమీపంలోని అన్ని గ్రామాలూ వ్యవసాయ, ఇతర పనుల మీద ఘట్కేసర్ వస్తున్నారు అలాగే అక్కడికి నుండి ప్రతి రోజు హైదరాబాద్ కి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ప్రజలు కూడా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్ లో వివరాలు చూస్తే…. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవగా వస్తున్నాయి. అయితే హైదరాబాద్ నుండి అంత పెద్ద ఎత్తున వలస కూలీలు రావడం తమని భయాందోళనకు గురిచేస్తుంది అని ఘట్కేసర్ ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ తమ సొంత ఊర్లకు వెళ్లాలని, అలాగే ఘట్కేసర్ ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పిన నిబంధలను పాటిస్తూ ఉండాలని డెక్కన్ న్యూస్ కోరుకుంటుంది.