కరోనా కేసులలో చైనాను దాటేసిన ఇండియా
ప్రపంచ దేశాలతో ఆరోపణలు ఎదురుకుంటున్న చైనాలో… ఇండియా కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ చైనాలో పుట్టింది అంటూ అగ్ర రాజ్యం అమెరికా ఘాటుగా చెబుతుంది. అయితే చైనా కంటే ఇండియా లో ఎందుకు ఎక్కవుగా కేసులు నమోదు అవుతున్నాయి అనే అంశం మీద కేంద్రం ద్రుష్టి సారించింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.