మెదక్ జిల్లా ధరిపల్లిలో కల్లోలం సృష్టించిన గాలివాన

తెలంగాణలోని మెదక్ జిల్లా ధరిపల్లిలో గాలివాన కల్లోలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోవడంతో… విపరీతమైన వేడి గాలి గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. గురువారం సాయంత్రం పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన గాలి రావడం దానితో బలమైన వాన కురిసింది. దీనితో గ్రామంలోని కొన్ని ప్రదేశాల్లో గాలికి కొంతమంది ఇంటి పైకప్పులు, రేకులు లేచి పోవడంతో వారు రోడ్డున పడ్డారు. కనీసం వారికీ ఉండడానికి కూడా చోటు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకి యుద్ధ ప్రాదిపదికన ఉండడానికి కనీస చోటు, నిత్యవసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే గ్రామంలో విద్యుత్ స్థంబాలు, పెద్ద పెద్ద చెట్లు నేల కూలాయి. దీనితో గ్రామంలో అంధకారం అలముకుంది. సాయంత్రం నుండి రాత్రి పొద్దు పోయే వరకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అలాగే పొరుగు గ్రామాల నుండి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు ఎండబెట్టిన వరి ధాన్యం కూడా వానకు పూర్తిగా తడిపొయాయి. ఇలాంటి వాన గతంలో వచ్చిన ఇంత పెద్ద వాన ఎప్పుడు రాలేదు అని గ్రామస్థులు తెలిపారు.