చేనేత ఉత్పత్తుల విక్రయం ద్వారా నేత కార్మికులకు తోడ్పాటు

దుబ్బాక చేనేత సహకార సంఘం వారు చేసిన వీడియో విజ్ఞప్తికి స్పందించి, అక్కడి చేనేత కార్మికుల బాధలు తెలుసుకొని, వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు, తెలంగాణ పద్మశాలి మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి గుంటక రూప సదాశివ్ గారు మరియు అఖిల భారత పద్మశాలి సంఘం – యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ గారు కలిసి 1000 చేనేత టవల్స్ కొనుగోలు చేయడం జరిగింది. నేత వృత్తికి తోడ్పాటును అందిస్తూ… కార్మికులకు సహకారం అందించాలని మొదటి విడతగా 1000 టవెల్స్ కొనుగోలు చేసినట్లు, దశల వారీగా మరికొన్ని తెప్పించనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉండి చేనేత కార్మికులకు సహాయం చేసే ఉద్దేశం ఉన్నవారు ఈ టవల్స్ ను హోల్ సేల్ ధరకే పొందవచ్చునని తెలియజేసారు. ఆసక్తి గల వారు ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్ ను వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు.

  • ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం చేనేత కళాకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించి, ఈ మెసేజ్ ను విస్తృతంగా షేర్ చేయగలరని మనవి.
  • ప్రస్తుతం రవాణా, కొరియర్ సదుపాయం లేనందున కేవలం హైద్రాబాద్ నగరంలో ఉన్న వారు, స్వయంగా వచ్చి తీసుకెళ్లేవారు సంప్రదించగలరు.
    గుండేటి శ్రీధర్
    జాతీయ అధ్యక్షులు
    అఖిల భారత పద్మశాలి సంఘం – యువజన విభాగం
    9989864789