ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ వైద్యుల ద్వారా పొందేందుకు వీలుగా ‘ఆస్టర్ ఈ కన్సల్ట్’ అనే మొబైల్ యాప్ ను ఆస్టర్ సంస్థ రూపొందించింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు నెలకొన్న సరికొత్త సాధారణ స్థితిలో, పరీక్షా సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి సమస్య లేకుండా ఇది ఉపయోగపడుతుంది.
జనరల్ ఫిజీషియన్, పీడియాట్రీషియన్స్, గైనకాలజిస్టులు, డెర్మటాలజిస్టు, డెంటిస్టు, కళ్ల వైద్యుడు, కార్డియాలజిస్టు, ఆర్థోపెడిక్స్, ఇతర ప్రముఖ సర్జన్లు కూడా యాప్ ద్వారా వీడియో లేదా టెలి కన్సల్టేషన్ అందించేందుకు ఆస్టర్ ఈ కన్సల్ట్ యాప్ ద్వారా సిద్ధంగా ఉంటారు.
ఇది అచ్చం వైద్యుల వద్దకు స్వయంగా వెళ్లి చూపించుకున్నట్లే ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మొత్తం గోప్యంగా ఉంటుంది. దాంతోపాటు వైద్యపరీక్షల నివేదికలు, మందుల చీటీలను కూడా ఏ సమయంలోనైనా ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. మీ ఇంటి పక్కనే వైద్యుడు ఉండి వెళ్లినంత సులభంగా ఇది ఉంటుంది.

ఆస్టర్ ఈ కన్సల్ట్ మొబైల్ యాప్ ప్రయోజనాలు:

  1. సురక్షితం, సులభం – ఎలాంటి భయం లేకుండా వైద్యుడితో కన్సల్టేషన్ కోసం తేదీ, సమయం ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
  2. ఆన్ లైన్ చెల్లింపు – ఫీజులను అత్యంత సురక్షితంగా ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్ వే ద్వారా చేయచ్చు.
  3. ఒక్కచోటే నివేదికలన్నీ – వైద్యునితో కన్సల్టేషన్ అయిన తర్వాత రోగికి ఒక సమగ్ర నివేదికతో పాటు మందుల చీటీ వస్తుంది. వాటిని పేషెంట్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్)లో డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. ఆ విభాగం కూడా మొబైల్ యాప్ లో ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా రోగులు వాటిని చూసుకోవచ్చు.
  4. ఈ అప్లికేషన్ హెచ్ఐపీపీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది, భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాలలో తెలిపిన నిబంధనలన్నింటినీ పాటిస్తోంది.
  5. ఆరోగ్య రక్షణ కొనసాగింపు కోసం ల్యాబ్ సేవలు, ఇంటివద్దే రక్షణ, మందులను ఇంటికే పంపడం లాంటివీ ఆస్టర్ ఎట్ హోం సాయంతో చేస్తున్నారు.
    దీని గురించి ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ పిళ్లై మాట్లాడుతూ, ‘‘ఈ కన్సల్ట్ మొబైల్ అప్లియేషన్ ద్వారా, ఎలాంటి కన్సల్టేషన్ కోసమైనా వైద్యులను రోగుల ఇళ్లకు అందుబాటులోనే ఉంచాలని మేం నిర్ణయించుకున్నాం. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండానే ఇది సాధ్యమవుతోంది. దీని ద్వారా మా అనుభవజ్ఞులైన వైద్యులు నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ, ఎక్కడైనా, ఎప్పుడైనా వాళ్ల రికార్డులను చూస్తూ వారికి కావల్సిన సలహాలు, సూచనలను అందిస్తారు. వైద్యులను రోగులు సంప్రదించేందుకు కావల్సిన అన్ని సేవలను ఎలాంటి ఇబ్బందిలేని ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫాం ద్వారా అందిస్తున్నాం’’ అని తెలిపారు.