తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, విత్తన, ఉద్యాన, మార్కెటింగ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో మంత్రుల నివాస సముదాయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు మంత్రి. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం ఏ రాష్ట్రంలోనూ లేదు అన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం పంటలు సాగుచేసేలా చూడాలని, రైతులను ఆ దిశగా సన్నద్ధం చేయండి అధికారులకు సూచించారు. ఒకే రకం పంటల సాగుతో రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజల ఆహార వినియోగంపై ప్రభుత్వం సంపూర్ణ సర్వే నిర్వహించిందని తెలిపారు. తెలంగాణలో వినియోగంతో పాటు దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి- ప్రపంచ ఆహార అవసరాల వివరాలను అధికారులు సేకరించాలి అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ సాగు నుండి రైతులను బయటకు తీసుకువద్దాం అని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు పంటను అమ్ముకునేందుకు కష్టపడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం చెప్పారు. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి చేరాలి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు అని తెలిపారు.సమగ్ర వ్యవసాయంపై సర్కారు దృష్టి పెట్టిందన్నారు.