మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకున్న భార్య
నిజామాబాద్ పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని భార్య సహవాసం చేసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ దారుణం జరిగింది. రక్తపుమడుగులో భర్త ఉన్నాడు. మతిస్థిమితం కోల్పోయి భార్య భర్తను హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం పాలవాడితో తన భర్త చనిపోయాడని శవాన్ని తీసుకెళ్లాలని వేడుకుంది. పాలవాడు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉద్యోగరీత్యా కొడుకు హైదరాబాదులో, కూతురు లండన్ లో ఉండడంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.