తెలుగు రాష్ట్రాల మధ్య పానీ పట్టు యుద్ధం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొదలైన జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నీళ్లు లేని ఎడారిలాగా తెలంగాణను మార్చారు అని ఇక్కడ ఉద్యమం మొదలైనది. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య అడపాదడపా కొన్ని కొన్ని సమస్యలు వచ్చిన సద్దుమణిగాయి. అప్పిటికే తెలుగుదేశం, తెరాసల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. అయినా కానీ సమస్యలపై పెద్దగా చర్చలు జరిగిన దాఖలాలు లేవు. కానీ రెండో సరి ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ సీఎం కావడం ఆయన ప్రమాణ స్వీకారం, ఇతర కార్యక్రమాలకు తెలంగాణ సీఎం కెసిఆర్ అప్పుడప్పుడూ ఆంధ్రాకి వెళ్లారు.
కానీ నీళ్ల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ కోసం కెసిఆర్ ఏమి చేస్తారు అనేది ఎప్పుడు ప్రశ్నర్థకంగా మారింది.
శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది అని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సంగమేశ్వర పాయింట్ నుంచి 3 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో పేర్కొన్నట్లు తెలిపారు. మొత్తం 8 టీఎంసీలకు ప్రపోజల్ పెట్టారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టు వల్ల తాగు, సాగునీటికి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రలతో కలిసిమెలిసి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ కొత్త ప్రాజెక్టులు ఆపాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాశారు. అవసరమైతే నేరుగా కలిసి ఏపీ ప్రాజెక్టుపై వివరణ ఇస్తామన్నారు. టెలిమెట్రి పెట్టాలని గతంలోనే కేఆర్‌ఎంబీని కోరాం.. ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు అని రజత్ కుమార్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్‌లో ఉందన్నారు. కృష్ణా జలాల పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు.
అయితే ఇద్దరు సీఎంల మధ్య ఉన్న సఖ్యతతో ఈ జల వివాదాన్ని సద్దుమణిగిస్తారో లేదో వేచి చూడాల్సిందే.