భారతపై చైనా వక్ర బుద్ది
ఒక రకంగా ప్రపంచాన్ని నాశనం చేసే దిశగా చైనా అడుగులు వేసింది అనే ఆరోపణలను మూటకట్టుకుంది. అయినా కానీ ఇంకా తమ వక్ర బుద్దిని పోనీయలేదు. భారత సరిహద్దుల్లో సిక్కింలో వద్ద.. మన జవాన్లతో చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. సుమారు 15 నుంచి 20 మంది భారతీయ సైనికులు .. చైనా సైనికులతో ముష్ఠిఘాతానికి దిగినట్లు తెలుస్తోంది. సిక్కింలోని సుమారు 16వేల మీటర్ల ఎత్తులో ఈ ఘటన శనివారం జరిగింది. రెండు దళాల మధ్య రాళ్లు రవ్వుకున్న సంఘటన కూడా జరిగింది. లైన్ ఆప్ యాక్టువల్ కంట్రోల్‌పై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారతీయ ఆర్మీ సైనికులు ఫైటింగ్ సీన్‌ను వీడియో తీశారు. సరిహద్దుల సమస్య తీరనందు వల్ల అప్పుడప్పుడు తాత్కాలిక ఘర్షణలు జరుగుతుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో 2017 ఆగస్టులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. లడాక్‌లోని పంగాంగ్ సరస్సు సమీపంలో కొట్టుకున్నారు. డోక్లాం పీఠభూమి వద్ద కూడా రెండు దేశాల సైనికుల మధ్య 73 రోజుల పాటు ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఒక వైపు కరొనతో ఇబ్బంది పడుతుంటే చైనా ఇలాంటి పనులు చేయడం చాల పెద్ద తప్పు చేయడమనే అని రాజకీయ విమర్శలు వస్తున్నాయి.