ఇంటిని శుభ్రం చేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
తెలంగాణ ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామ రావు చెప్పిన మాట ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేరకు ఈరోజు శంబీపూర్ గ్రామంలోని తన నివాసాన్ని పరిశుభ్రం చేసారు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కరోనా మహమ్మారి తమ దరికి చేరకుండా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మన చుట్టు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటున్నది తెలిపారు. ఈ కష్ట కాలంలో ప్రభుత్వానికి మంచి వస్తుంది అనే అక్కసుతో విపక్షాలు పస లేని ఆరోపణలు చేస్తుంది అని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రజల పక్షంలో నిలబడి వారికి అండగా ఉంటాము అని అన్నారు.