ట్రంప్ కెసిఆర్ మనసులు ఒక్కటేనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , తెలంగాణ సీఎం కెసిఆర్ మనసులు ఒకేలా ఉన్నాయా అంటే దాదాపు అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. కరోనా విషయంలో వీరిద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉన్నాయి అనిపిస్తోంది. కరోనా వైరస్ వల్ల దేశాలు విలవిలాడుతుంటే కట్టడి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అమెరికాలో ట్రంప్ , తెలంగాణాలో కెసిఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో అందరికీ కరోనా టెస్టులు అవసరం లేదు అని వెల్లడించారు, అలాగే ఇక్కడ తెలంగాణాలో కూడా సీఎం కెసిఆర్ కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నవారికే కరోనా టెస్ట్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారని సమాచారం. గతంలో కూడా కెసిఆర్ లాగే ఎన్నికల విధానంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అని ట్రాంప్ తన ప్రచారంలో హామీ ఇచ్చి విజయం సాధించారు. ఇక్కడ కూడా సీఎం మా నీళ్లు, నిధులు , నియామకాలు అని రాష్ట్రము సాధించారు. ఇలా వీరి ఇద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.