లాక్‌డౌన్ సమయంలో కొత్త ప్రాంతాలను అన్వేషించిన జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

దేశంలో వంట నూనెల విభాగంలో బేధాలను కోవిడ్-19 లాక్ డౌన్ సృష్టించింది. ఫ్రీడం బ్రాండ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్) ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ వ్యాప్తిని చేయడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడంతో పాటుగా నూతన సాధారణతకు అలవాటుపడుతుంది. లాక్‌డౌన్ కారణంగా కంపెనీ తమ కర్మాగారాల యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోయింది. అనిశ్చితిలో కార్మికుల పరిస్థితి ఉండటం, స్థానిక భావోద్వేగాలు మారుతుండటం దీనికి కారణం. సానుకూల డిమాండ్ ఫ్రీడం ఆయిల్‌కు ఉన్నప్పటికీ ఆ డిమాండ్‌ను పూర్తిగా అందిపుచ్చుకోలేకపోవడం చేత మొత్తంమ్మీద ఈ ప్రభావం పరంగా పెద్ద మార్పు లేదు.
శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ -సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ మాట్లాడుతూ “జీఈఎఫ్ ఇండియా మూడు విభాగాలు హోటల్స్/ ఇనిస్టిట్యూషన్లు అనుసరించి పరిశ్రమలు (బేకరీ, ప్యాకేజ్డ్ ఫాస్ట్ ఫుడ్ మరియు స్నాక్స్) మరియు గృహ విభాగ అవసరాలను తీరుస్తుంది. హోటల్స్/ఇనిస్టిట్యూషన్స్, వెడ్డింగ్స్ మరియు ఈవెంట్స్ అనేవి కోవిడ్-19 లాక్‌డౌన్ ఫలితంగా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఈ ఫలితంగా పామ్ ఆయిల్‌కు డిమాండ్ 50%కు పైగా తగ్గింది. అయితే, ఈ మొత్తాన్ని కొంతమేరకు అంటే 20% వరకూ సన్‌ఫ్లవర్‌కు పెరిగిన డిమాండ్ పూరించింది. సాధారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ముఖ్యంగా ఏపీ, తెలంగాణా, కర్నాటక, ఒడిషాలలో ఇళ్లలో వాడుతుంటారు. వంటనూనె అనేది నిత్యావసర సరుకు. అందువల్ల సరఫరా పరంగా అవాంతరాలు కూడదు. ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సరఫరా చేయడమనేది మా సామాజిక బాధ్యత. స్థానిక రాష్ట్ర మరియు జిల్లా యంత్రాగాల మద్దతుతో అవసరమైన అనుమతులన్నీ మేము పొందగలిగాము. మా కర్మాగారాల నుంచి ప్యాకేజ్డ్ ఆయిల్‌ను పలు పంపిణీ కేంద్రాల వద్దకు మరియు తుది వినియోగదారులకు పంపేందుకు తగిన అనుమతులను సైతం మేము అందుకున్నాం” అని అన్నారు.
శ్రీ చంద్రశేఖర రెడ్డి మరింతగా చెబుతూ ” వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫ్రీడం ఆయిల్స్ లభ్యమవుతాయన్న భరోసా కల్పిస్తూ రిఫైనింగ్ యూనిట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హ్యాండ్ శానిటైజేషన్, తరచుగా ప్రాంగణాన్ని క్రిమి రహితంగా చేయడం, భౌతిక దూరం ఆచరించడం, పని చేయడానికి వచ్చిన ఉద్యోగులకు ఉష్ణోగ్రతలను పరిశీలించడం మరియు వ్యక్తిగత పరిశుభ్రత వంటి మార్గదర్శకాలన్నీ కూడా ప్లాంట్ వద్ద ఆచరిస్తున్నామనే భరోసాను అందిస్తున్నాం. ఇవే అంశాలపై మా ఛానెల్ భాగస్వాములకు సైతం అవగాహన కల్పిస్తూనే, పాయింట్ ఆఫ్ పర్చేజ్ వద్ద స్టాక్ పరంగా ఎలాంటి కొరతలేదని వారికి తెలియజేస్తున్నాం. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా, మేము మా కర్మాగారాల పూర్తి సామర్థ్యం ప్రకారం పనిచేయలేకపోయాము. కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటం, మారుతున్న స్థానిక సెంటిమెంట్లు కూడా ఇందుకు దోహదం చేశాయి. ఈ కార్మికుల సమస్య పరిష్కరించడానికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యంత్రాంగం సహాయపడినప్పటికీ, ఇతర నిర్వహణా సవాళ్లు కారణంగా మేము దాదాపు 70% సామర్థ్యంతోనే పనిచేశాం” అని అన్నారు.
జీఈఎఫ్ ఇండియాకు 3 కర్మాగారాలున్నాయి. వాటిలో రెండు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉంటే మరోకటి కృష్ణపట్నంలో ఉంది. ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిషా, కర్నాటక, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు (బల్క్)లలో ఉనికిని చాటుతుంది. ఈ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 35వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్. జీఈఎఫ్ ఇండియా ఇటీవలనే నూతన ప్లాంట్‌ను కాకినాడలో రోజుకు 1200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటుచేసింది. కాకినాడలో రోజుకు 350 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌తో పాటుగా కృష్ణపట్నంలో రోజుకు 900 టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లకు ఇది అదనం. ఈ నూతనంగా ఏర్పాటుచేసిన ఆటోమేటెడ్ ప్లాంట్ అత్యాధునిక సాంకేతికత మరియు మౌలిక వసతులతో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఈ కంపెనీ తమ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 2.25 కోట్ల రూపాయలను తాము కార్యకలాపాలను సాగిస్తున్న ప్రాంతాలలో ప్రజలకు తోడ్పడే రీతిలో కోవిడ్-19 ఉపశమన కార్యక్రమాల కోసం అందించింది. వీటిలో పీఎం కేర్స్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు మరియు సీఎం రిలీఫ్ ఫండ్స్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా) ఒక్కొక్కరికీ 50 లక్షల రూపాయలు; సీఎం రిలీఫ్ ఫండ్ (కర్నాటక, ఒడిషా, తమిళనాడు ) ః ఒకొక్కరికీ 25 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకుని 40 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు – వంటనూనె మరియు ఆహార పదార్థాలను ఆంధ్రప్రదేశ్‌లోని జీఈఎఫ్ రిఫైనరీల చుట్టు పక్కల ప్రాంతాలకు అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకనుగుణంగా భౌతిక దూర ప్రమాణాలను జీఈఎఫ్ ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా సిబ్బంది మరియు కార్మికుల సంక్షేమం మరియు భద్రతకు భరోసా అందిస్తుంది. ఫ్యాక్టరీల వద్ద పారిశుద్ధ్యంను నిర్వహించడంతో పాటుగా తరచుగా ఉద్యోగులతో పాటుగా వారి కుటుంబసభ్యులకు వచ్చిన జ్వరం లేదా ఇతర లక్షణాలను సైతం పరీక్షిస్తుంది. అంతేకాకుండా మొత్తం ప్లాంట్‌ల వద్ద పరిశుభ్రతను నిర్వహిస్తుంది. ఇది నూతన సాధారణతగా నిలువడంతో పాటుగా దీనిని అమలు చేయడానికి జీఈఎఫ్ అత్యంత వేగంగా అధ్యయనం చేస్తుంది.
ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ గురించి ః
జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా)కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్ ఫ్రీడం. ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ ఇప్పుడు ఫ్రీడం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడం ఫిజికల్లీ రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్ మరియు ఫ్రీడం మస్టర్డ్ ఆయిల్, ఫ్రీడం గ్రౌండ్‌నట్ ఆయిల్ రూపంలో లభిస్తుంది.
ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ రేంజ్‌ను ఏప్రిల్ 2010లో ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో ఆవిష్కరించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో అగ్రగామి బ్రాండ్ వెలుగొందుతుండటంతో పాటుగా ప్రస్తుతం నెంబర్ 1 ర్యాంకును మార్కెట్ వాటా పరంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో గెలుచుకుంది. వరుసగా అత్యధిక మార్కెట్ వాటాను సన్‌ప్లవర్ ఆయిల్ పరంగా వరుసగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో కలిగి ఉంది. (ఆధారం ః క్యు3- 19 నివేదిక ఏసీ నీల్సన్)
ఫ్రీడం ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ మొత్తం కుటుంబానికి ఆరోగ్యవంతమైన ఎంపిక. దీనిని అక్టోబర్ -15లో ఆరోగ్యం పట్ల ఆప్రమప్తత కలిగిన వినియోగదారుల కోసం ఆవిష్కరించారు. దీనిలో 10000 పీపీఎం ఒరైజనాల్ ఉంది. దీనిలోని సమతుల్యమైన ఫ్యాట్ ప్రొఫైల్ కారణంగా ఫ్రీడం ఆర్‌బీఓ ఇప్పుడు ఈ విభాగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది.