తెలంగాణాలో చర్చా వేదికలు నిర్వహించే జర్నలిస్టులే లేరా ?

ఎన్నో ఉద్యమాలు, చెప్పలేని లాఠీ దెబ్బలు, నిర్బంధాలు, అణిచివేతలు అయినా చివరి వరకు పోరాడి కళలుగన్న తెలంగాణ సాదించుకున్నా…. ఇంకా ఆంధ్రా ఆధిపత్యం పోవడం లేదు. ప్రధానంగా మీడియాలో ఈ వ్వవస్థ మరింత బలంగానే ఉంది. టీవీ ఛానెల్స్ లో ఉదయం, రాత్రి సమయాల్లో పలు చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రస్తుత పరిస్థుల్లో తెలంగాణా అంశాలు కూడా ఆంధ్రా జర్నలిస్టులో లేక సెటిలర్స్ నిర్వహించాల్సిందేనా….తెలంగాణాలో ఇంత భావ దారిద్య్రం ఉందా…లేక తెలంగాణా వచ్చిన ఆరేళ్లకు కూడా అణిచివేత కొనసాగుతున్నదా..తెలంగాణా సమస్యలు వలస వాదులే ఎత్తి చూపాలా..ఉద్యమంలో గర్జించిన గళాలను వ్యూహాత్మకంగా అణిచి వేస్తున్నారా..ఒకరు అశ్లీల వార్తల తో చర్చలు నిర్వహిస్తారు. ఇంకొకరు తప్పుడు సమాచారంతో చర్చలు నిర్వహించి జైలుకు వెళ్లారు. ఛానళ్లు పెట్టించి దోచుకుంటారు.యాంకర్ లను ట్రాప్ చేస్తారు..మరొకరు బ్రాండ్ ఇమేజితో నెట్టుకొస్తారు.అది లేకపోతే వాళ్ళు జీరోలని నిరూపించుకున్నారు. ఇలాంటి దారుణ,నీచ చరిత్ర ఉన్న వారే చర్చా వేదిక నిర్వహించే జర్నలిస్టులు.. మరి తెలంగాణ జర్నలిస్టులకు ఈ క్వాలిఫికేషన్ లేకపోవడమే నేరమా..యాజమాన్యాలు చెప్పినట్టు బ్లాక్ మెయిల్ కు సహకరించకపోవడమే…
తెలంగాణా జర్నలిస్టులు యాజమాన్య కులాల వారు కాకపోవడమా..చర్చా వేదికలు నిర్వహించాలంటే ముంచడంలో పీహెచ్ డీ చేసి ఉండాలా..అర్హతలేంటి..తెలంగాణా జర్నలిస్టులారా జాగో..తెలంగాణా ప్రజలారా మన జర్నలిస్టులు లేని ఆ చర్చలు మనమెందుకు చూడాలి..ఇంకా ఎంత కాలం వారి ఆధిపత్యంలో మనం ఉండాలి అనేది మన తెలంగాణ జర్నలిస్టులే తేల్చుకోవాలి. అన్ని చానెళ్లు ఆయా పార్టీలు, యజమాన్యాలకే డప్పు కొడుతున్నాయి.