శృంగారం చేస్తే కరోనా వస్తుందా ?

కరోనా ప్రపంచాన్ని కకావికలం చేసింది. అంటుకుంటే చాలు, దగ్గినా, తుమ్మినా , గాలిలో ఇలా ఎలా వస్తుందో తెలియదు కానీ యావత్తు భూమండలాన్ని తన గుప్పిటిలో పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ కరోనా సోకి లక్షల మంది మరణించారు. ఎంతో మంది వ్యాధి భారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఒకే కానీ అసలు కథ ఇప్పుడే మొదలవనుంది.
ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ కి కొన్ని సడలింపులు ఇస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే ఇప్పుడు ఎక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. కొన్ని పాశ్చత్య దేశాల్లో శృంగారం చట్టపరంగం నడుస్తుంది. సడలింపులలో భాగంగా వేశ్యలు శృంగారం చేయడం లేదా అక్రమ సంబంధాల వల్ల శృంగారం చేయడం ద్వారా కరోనా వస్తుందా అనే భయం పట్టుకుంది. అయితే ఇటీవల చైనాలోని షాంగిక్యూ మున్సిపల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ తో భాదపడుతున్న 38 పై పరిశోధనలు చేసారు. కాగా వీరిలో 6గురి వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్టు కనుగొన్నారు. అయితే ఇది వీర్యంలో ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనేది ఇంకా స్ఫష్టత రాలేదు. అసలు శృంగారం చేస్తే కరోనా సోకుతుంది అనేది తేలాల్సి ఉంది.
ఇక మరోవైపు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం ప్రధానంగా అదారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే కొన్నిస్పా ల ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లో ఈ పద్ధతి కొనసాగుతుంది. ఇప్పటికే తన జీవనాదారం కోల్పోయాము అని ప్రభుత్వాలకు కొంత మంది వేడుకుంటున్నారు. ఒకవేళ శృంగారం చేస్తే కరోనా సోకుతుంది అంటే ఎయిడ్స్ కంటే త్వరగా చనిపోయే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది నిపుణులు. అయితే మరి కొన్ని రోజులు ఓపిక పడితే వీర్యంలో కరోనా వైరస్ బతికి ఉంటుంది అనేది పరిశోధనల ద్వారా తెలియనుంది. భౌతిక దూరం పాటిస్తున్న మీరు బయట వ్యభిచార గృహాల్లో శృంగారం చేయవద్దు అని డెక్కన్ న్యూస్ పిలునిస్తుంది.