కరోనా పరీక్షల విషయం లో హైకోర్టు లో పిల్ ధాఖలు
కరోనా పరీక్షల విషయం లో రాష్టం అవలంభిసస్తున్న తీరుపై హైకోర్టు లో పిల్ ధాఖలు..
పిల్ ధాఖలు చేసిన విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు..రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్..
కరోనా పరీక్షల ఎందుకు జరపడం లేదని ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి..మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..
అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వం కు ఆదేశం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని తెలిపిన ఏజీ..లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టు.
కంటైన్ మెంట్ జోన్లలో ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్..
వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయడం లేదో తెలపాలని ప్రభుత్వం కు సూచించిన హైకోర్టు..పూర్తిస్థాయి పరీక్షలు చేయకపోతే వాస్తవాలు ఎలా తెలుస్తాయన్న హైకోర్టు..
గణాంకాలతో గజిబిజి చేస్తే కరోనా వ్యాప్తిపై వాస్తవాలు తెలియదని హైకోర్టు వ్యాఖ్య..తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసిన హైకోర్టు..