తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే

రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి.

హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు.

15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి హైదరాబాద్ లో ఎలాంటి స‌డ‌లింపులు ఇవ్వాల‌న్న‌ది నిర్ణయం చెబుతామ‌న్నారు సీఎం కేసీఆర్.

గ్రామాలలో గ్రీన్, ఆరెంజ్ జోన్లో అన్ని రకాల షాప్ లు నడుస్తాయి.ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు షాప్ లు నడుస్తాయి.

రాత్రి 7 గంటల నుండి పొద్దున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. మున్సిపల్ టౌన్లలో 50 శాతం మాత్రమే షాప్ లు నడుస్తాయి.

ఆఫీసుల్లో 33 శాతం సిబ్బందితో పనులు చేసుకోవ‌చ్చు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 100 శాతం నడుస్తాయి. మైనింగ్ బుధ‌వారం నుంచి వంద శాతం నడుస్తాయి.వాహన రిజిస్ట్రేషన్లు కూడా మొద‌ల‌వుతాయి.