రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్: కేసీఆర్
మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు 43 మంది కోలుకోగా.. మొత్తంపై డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 628కి చేరుకుందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 439 మంది చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు. కేబినెట్ 7 గంటల సుదీర్ఘ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నాం అని అన్నారు











