రేషన్ డీలర్ షిప్ రద్దు
కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ప్రతి కుటుంబానికి 12 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేసింది. అయితే వాటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో డీలర్ షిప్ రద్దు చేసారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా శంశిరెడ్డి పల్లి తండాలో బానోతు శ్రీనివాస్ అనే అతను కొద్ది కాలంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే గత నెలలో ఈ గ్రామపంచాయితీకి అనుబంధ గ్రామమైన బండమీదిపల్లి లో కూడా ఉచిత బియ్యం సరఫరా చెయ్యాలిసి ఉంది. విధి నిర్వహణలో భాగంగా బియ్యం సరఫరా చేసే సమయంలో పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డిపై దృభాషలాడుతూ అతన్ని కించపరిచారు. ఈ విషయం పై అతను పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ దన్ సింగ్ కి గ్రామా ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బానోతు శ్రీనివాస్ రేషన్ డీలర్ ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.