ఘట్‌కేసర్‌ నుంచి తరలివెళ్లిన వలస కార్మికులు

రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో అధికారులు రైల్వే స్టేషన్‌కు తరలించారు. రైల్వే స్టేషన్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ భద్రతా ఏర్పాటు పరిశీలించారు. వలస కార్మికులు వారి సొంత రాష్ర్టాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో మే 1న జార్ఖండ్‌కు చెందిన వలస కార్మికులతో మొదటి శ్రామిక్‌ స్పెషల్‌ రైలు లింగంపల్లి నుంచి వెళ్లినవిషయం తెలిసిందే.