బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి : పువ్వాడ

రవాణా శాఖకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు తిప్పలు తప్పవని అన్నారు. ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చామని చెప్పారు. మంగళవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చెక్‌పోస్టుల్లో పని చేసే సిబ్బందికి, రవాణా శాఖ డ్రైవర్ల కోసం 5వేల కోవిడ్ 19 ప్రొటెక్షన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిబ్బంది రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.