కేటీఆర్ సమావేశం
• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు
• జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి
• ముఖ్యంగా srdp, లింకు రోడ్ల నిర్మాణము వంటి వాటి ద్వారా రోడ్డు పనులను ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో శీఘ్రగతిన పూర్తిచేసేందుకు పనిచేస్తుంది.
• పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి రైల్వే, రైల్వే అండర్ బ్రిడ్జి లకు సంబంధించి పనులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని వర్కులను పూర్తి చేసేందుకు మంత్రి కేటీఆర్ కోరారు.
• ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఆర్వోబి, అర్ యు బి ల వారీగా సమీక్ష సమావేశంలో చర్చిస్తున్న మంత్రి మరియు రైల్వే శాఖ అధికారులు
• జిహెచ్ఎంసి రోడ్డు వర్కు లతోపాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో చర్చిస్తున్న మంత్రి మరియు అధికారులు
• రైల్వే శాఖ కూడా జీహెచ్ఎంసీ మాదిరి వేగంగా పనులను పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని కోరిన మంత్రి కేటీఆర్
• వచ్చే వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వే కు సంబంధించిన పనులను పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జిహెచ్ఎంసి అధికారులకు మంత్రి ఆదేశం
• ఇందుకు అవసరమైన అనుమతులు, ఇతర పనులకు తమ వైపు నుంచి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపిన మంత్రి
• ఈ సమావేశానికి హాజరైన నగర మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనన్ మాల్య, మరియు రైల్వే ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లొకేశ్ కుమార్, జలమండలి ఎం డి దానకిషోర్