మీకు ఆలా ఉంటే మాకు చెప్పండి : సర్కార్
కరోనా లాక్ డౌన్ కొన్ని సడలింపులు చేస్తూ అన్ని ఆసుపత్రులకు అవుట్ పేషంట్ విభాగాలకు అనుమతులు ఇస్తూ సర్కార్ ఉత్తరువులు జారీ చేసింది. అలాగే ఓపీ కోసం వచ్చేవారి వివరాలు తమకు తెలియజేయాలని చెప్పింది. కరోనా వైరస్ టెస్టుల విషయమై తెలంగాణ సర్కారు హాస్పిటళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారి వివరాలను ఇవ్వాలని ప్రభుత్వ, ప్రయివేట్ హాస్పిటళ్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ పాలైన వారికి కోవిడ్ పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా లేకున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులు హాస్పిటళ్లకు సూచించారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న 190 శాంపిళ్లను పరీక్షించగా.. వీటిలో 8 కరోనా పాజిటివ్‌గా తేలాయి. లక్షణాలు చాలా వరకు కరోనా లక్షణాలను పోలి ఉంటాయి. ఏదైనా ప్రాంతంలో సారి కేసులు ఎక్కువ సంఖ్యలో ఊహించని విధంగా నమోదైతే కరోనా వైరస్ కూడా బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు, ఫస్ట్ కాంటాక్టులకు మాత్రమే టెస్టులు చేస్తోంది.