తెలంగాణాలో వారికి అనుమతి
తెలంగాణాలో ఎట్టకేలకు వారికీ అనుమతి దొరికింది. ఆర్ధికరంగానికి కాస్త వెసులుబాటు అయ్యేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలు , ఇక్కడి దినసరి కూలీలకు పనులు దొరికేలా అవకాశం వచ్చింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిల్డర్స్ అసోసియేషన్ల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిల్డర్స్ (ట్రేడయ్, క్రెడాయ్) అసోసియేషన్…తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు డేవలపర్స్ కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుంది అన్నారు సీఎస్. వలస కూలీల కు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పాలని సూచించారు. వారికీ కావలసిన వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రోత్సహకాలు వైద్యపరమైన జాగ్రత్తలు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్ సిమెంట్ ఇసుక ఇటుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకువచ్చే వెసులుబాటును కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామాగ్రి తీసుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు కమిషనర్లకు అదేశాలు జై చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ డిజిపి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్,ముగ్గురు కమిషనర్లు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.