విజయ్ దేవరకొండ నచ్చినది ఆమెనే
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆ సిమిమా తరువాత అతనికి వచ్చిన పబ్లిసిటీ అంత ఇంత కాదు…. అతని నిజం పేరు బదులు అర్జున్ రెడ్డి అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అంతగా అభిమానుల మనసులో పాతుకుపోయారు.. ఆ సినిమా తరువాత అమ్మయిల ఫాలోయింగ్ ఇక చెప్పనక్కర్లేదు. ఇక అతని విషయానికి వస్తే ఏ విషయాన్నైన ఉన్నది ఉన్నట్టు చెప్పడం అతనికి అలవాటు. తాజాగా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల విషయంలో తను కోరుకునే కొన్ని క్వాలిటీస్ వివరించాడు. ఇందుకు ప్రశ్నగా అలాంటి అమ్మాయిని మీరు మీ జీవితంలో ఎప్పుడైన కలిసారా అంటే అవుననే సమాధానం విజయ్ దగ్గర నుండి వచ్చింది. విజయ్ సమాధానాన్ని బట్టి చూస్తుంటే ఇతను ఎవరితోనో రిలేషన్‌షిప్‌లో ఉండే ఉంటాడని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం జీవితంలో స్థిరపడాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఆ దిశలో అడుగులు వేస్తున్నానని విజయ్ స్పష్టం చేశారు . ప్రస్తుతం విజయ్ ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.