కరొనపై ప్లాస్మా చికిత్స ఫెయిల్
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ని నుండి కాపాడుకునే ఏకైక మార్గం ప్లాస్మా చికిత్స. ఇది ఇప్పటికే ఢిల్లీ మంచి ఫలితాలు ఇవ్వడంతో… కరోనా కేసులు ఎక్కవగా ఉన్న మహారాష్ట్రలలో ప్రయత్నం చేసారు. ఈ చికిత్స చేసిన సమయంలో బాగానే ఉన్నట్టు అనిపించినా చివరికి మరణం తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలో తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన 53 ఏళ్ల వ్యక్తి బుధవారం అర్థరాత్రి మరణించారు. వివరాల ప్రకారం.. కరోనా కారణంగా ఓ వ్యక్తి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరగా, ప్లాస్మా చికిత్స అందించారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన 200 మి.లీ. ప్లాస్మాను అందించి ట్రీట్‌మెంట్ కొనసాగించారు. మొదట్లో కోలుకుంటున్నట్లు అనిపించినా, తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 24 గంటల్లోనే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇది వరకే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ప్రకారమే ప్లాస్మా చికిత్స చేశామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే తెలిపారు. బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో మరో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స చేస్తున్నామని, అది విజయవంతమవుందని ఆశిస్తున్నట్లు వెల్లడించిన కొద్ది గంటల్లోనే మొదటి ప్లాస్మా చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించడం గమనార్హం.
కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటి ద్వారా కనీసం నలుగురు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.