పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న జీవితాలు ఎన్నో… ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేసే చేతులు కావాలి మనకు.  
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా…. కన్న ఊరిమీద ప్రేమ తగ్గడం లేదు. కని పెంచి ఊరికి ఈ కష్ట  కాలంలో కాస్త చేయూతనిద్దామని పరితపిస్తున్న వారెందరో. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కోవకు చెందినవారే ఈ రైతు బిడ్డ శ్రీధర్ రెడ్డి. గ్రామీణ ప్రాంతమైన ధర్మారంలో పుట్టి పెరిగి తెలంగాణ పోలీస్ శాఖలో సదాశివపేట సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన స్వంత ఊరి మమకారం అలాగే ఉంది.
కరోనా లాక్ డౌన్ వల్ల  గ్రామంలో పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న కూలీలు , ఇతర పేదవారికి తన వంతు సాయంగా బియ్యం ఇతర నిత్యవసర సరుకులు పంపిణి చేసారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా లాక్ డౌన్ నియమాలు తప్పకుండ పాటించాలి ఈ సందర్బంగా శ్రీధర్ రెడ్డి గ్రామస్థులకు సూచించారు. మాస్కులు ధరించడం , శానిటైజర్ వాడకం గురించి వివరించారు. చిన్నప్పుడు ధరిపల్లిలో చదువుకున్న సమయాన్ని కూడా గుర్తు చేసారు.