ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్
తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు జిల్లాలకు వైద్యం , ఇతర ఆత్యవసర పనులకు కూడా ఆయా జిలాలకు వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పింది సర్కార్. ఈ నిబంధనలు మరింత పటిష్టం చేయడానికి పోలీస్ బలగాలను పెంచనున్నట్టు తెలిపింది.