లాక్‌డౌన్ ఉన్నంతవరకు భోజనాలు ఏర్పాటు
పేదవారికి సేవ చేయడంలో ఆనందాన్ని పొందవచ్చు అని మహిళా దక్షత సమితి అధ్యక్షురాలు, డాక్టర్ సరోజ్ బజాజ్ అన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. మహిళా దక్షత సమితి గత మూడు దశాబ్దాలుగా సామాజిక సేవలో నిమగ్నమై ఉందని రెండు తెలుగు రాష్ట్రాలలో సామాజిక సేవారంగంలో పాలుపంచుకుంటున్నది తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, వృద్ధులకు డేకేర్ సెంటర్లు, మొబైల్ మెడికేర్, షార్ట్ స్టే హోం, వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లు, స్వధార్ హోంల లాంటివి ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి తెలిపారు. ఉన్నత విద్య ద్వారా మహిళా సాధికారత సాధించాలన్నది మహిళా దక్షత సమితి ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనవర్గాలకు చెందిన బాలికలు తమంతట తాముగా కళాశాల విద్యకు రాలేక, స్కూలు స్థాయిలోనే డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారు. అనాథలు, తల్లిదండ్రులలో ఎవరో ఒకరే ఉన్నవారు, రోజుకూలీల పిల్లల్లాంటివాళ్లకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లలకు మహిళా దక్షత సమితి ఆధ్వర్యంలో ఉచితంగా విద్య అందించడంతో పాటు వసతి కూడా కల్పిస్తున్నాము. విద్యా ప్రాంగణాలకు అనుబంధంగానే హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. చదువు మాట అటుంచితే కనీసం ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని పేదలు కావడంతో వారికి ఇవన్నీ అందిస్తున్నాము వివరించారు.
వరదలు, కరవు లాంటి ప్రకృతి విపత్తులు ఏవి సంభవించినా, లేదా ప్రమాదాలు జరిగినా మహిళా దక్షత సమితి తనవంతు సాయం అందిస్తూనే ఉంటుంది. కొవిడ్19 సహాయ చర్యల కోసం డాక్టర్ సరోజ్ బజాజ్ వ్యక్తిగతంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి గతవారం రూ. 4 లక్షలు విరాళంగా అందించారు. దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్న వలసకూలీలకు సాయం చేసేందుకు బియ్యం, పప్పులు, పంచదార, నూనెతో పాటు వ్యక్తిగత రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశాము. గత 15 రోజులుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న పేదలకు రోజూ 1000 ఆహార పొట్లాలను అందిస్తున్నాము. లాక్‌డౌన్ ఉన్నంతవరకు ఈ పంపిణీ కొనసాగుతుంది.











