మీకు అండగా మేమున్నాము : విజయపురి కాలనీ వాసులు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. పట్టెడు అన్నం దొరకాలి అంటే పుట్టెడు కష్టాలు పడాలి. పైసలు పెట్టి బియ్యం కొనాలి అంటే ఆ పైసల మొకం చూసి చాల రోజులవుతుంది. ఇక కడుపులెట్టా నిండేది. బతుకు జీవితం ఎలా నడిసేది. ఇది ఇప్పుడు దేశం అంతా కనిపిస్తున్న దృశ్యాలు. హైదరాబాద్ తార్నాకలోని విజయపురి కాలనీలో తెరాస నేత అంజనారెడ్డి తన కొడుకు అంకిత్ పుట్టిన రోజు సందర్బంగా పారిశుధ్య కార్మికులకు బీదవారికి వారానికి సరిపడా కూరగాయలు , ఇతర సరుకులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎస్.ఐ . శ్రీనివాసులు , లాలాగూడ ఎస్.ఐ.మల్లయ్య, జుడే & కాలనీ వాసులు వనం వెంకట్ రవి కిరణ్ రమేష్ వాసన్ , ఫరీద్ , కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.