తరుగు వడ్లు తక్కువ తీయండి : అఖిలపక్షం

డెక్కన్ న్యూస్ హైదరాబద్ :
సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వివిధ పార్టీలు ప్రజల తరుపున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలు ప్రతీ కుటుంబానికి 5 వేలు ఇవ్వాలి..
ఫైన్ క్వాలిటీ బియ్యం ఇవ్వాలి…తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కు కొనాలి..40కేజీ బస్తాకు 2కేజీ ల కంటే ఎక్కువ తరుగు తీయొద్దు..నాలుగైదు కిలోలు తరుగు తీస్తున్నారు..పసుపు,బత్తాయి,నిమ్మ,మామిడి విషయంలో మార్కెట్ ఇంట్రవెన్షన్ చేయాలి..ఏపీలో 80 వేలు,కానీ 19 వేల టెస్టులు మాత్రమే జరిగాయి..కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి….కేసుల సంఖ్య తగ్గించడానికే తక్కువ పరీక్షలు..కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలి..
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్…
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంది.. ఏ ఆసుపత్రిలో కూడా ఆరోగ్య శ్రీ పని చేయడం లేదు… ఐసీఎమ్మార్ గైడ్లైన్స్ ప్రకారమే చేస్తున్నామని ఈటెల రాజేందర్ చెప్పింది అబద్ధం..వెంటనే ప్రైవేటు ఆసుపత్రులను కూడా తెరవాలి..
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ
రైతుల అప్పుల మాఫీ వెంటనే చేయాలి.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణా వలస కార్మికులకు సహాయం చేయాలి..ఆటో,క్యాబ్ డ్రైవర్ లు ఉపాధి కోల్పోయి నష్టపోయారు..వారిని ఆదుకోవాలి…కరోనా ఖర్చు లెక్కలు వెంటనే చెప్పాలి.. అఖిల పక్షాన్ని పిలవడం లేదు..ఇది ప్రపంచ విపత్తు..అందరినీ భాగస్వామ్యం చేయండి.. సామాజిక దూరం పాటించే పనులు గుర్తింపు కు కమిటీ వేయండి.. కేవలం కేసీఆర్ కుటుంబం తోనే సమస్య పరిష్కారం కాదు… తీపి మాటలు చేదు పనులు చేస్తారు.. డిమాండ్ లు పరిష్కరించకపోతే గవర్నర్ ను కలుస్తాము..ఇక్కడే ధర్నా చేస్తాము..
చాడా వెంకట్ రెడ్డి.. సీపీఐ
కార్డులేని అర్హులైన వారందరికీ రేషన్ ఇవ్వాలి.. అసంఘటిత కార్మికులకు, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ ఉన్నా ఇవ్వడం లేదు..5 వేలు ఇవ్వండి.. వలస కార్మికుల ను వెంటనే స్వస్థలాలకు పంపాలి.. వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు..అన్నీ కొనుగోలు చేయండి..నష్ట పరిహారం ఇవ్వండి..
కోదండరాం… టీజేఎస్ అధ్యక్షుడు
ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ ఇవ్వండి.. పప్పు,నూనె ఇవ్వండి.. పేదలకు మరో రెండు నెలలు సహాయం అందించండి… ఈ త్రైమాసానికి వాహన పన్ను రద్దు చేయండి.. క్వాలిటీ నిర్ధారించేది ప్రభుత్వమా ఉపాధి హామీ ని అనుసంధానం చేయండి.. ధర్మ గంటలు కట్టకపోయినా ఫర్వాలేదు..కాల్ సెంటర్లు ఏర్పాటు చేయండి… లాక్ డౌన్ అమలుకు సహకరిస్తాము..కానీ ప్రజల సమస్యలను అడుగుతాము..