విజయపురి విజయం : వనం వెంకట్
కరోనని అడ్డుకోవడానికి పోలీసులు, డాక్టర్లు ఇతర సిబ్బందితో పాటు మేము సైతం అంటున్నారు తార్నాకలోని విజయపురి కాలనీ వాసులు. ఈ అంటూ వ్యాధిని అడ్డుకోవాలి అంటే … స్వీయ నిర్బంధమే మార్గం అని అందుకు తాము అంతా ఒకేతాటిపై ఉన్నామంటున్నారు. బయట వారు తమ కాలనీలోని రాకుండా పోలీసులు ఎలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నారో అలాగే కాలనీ చుట్టూ ఉన్న 7 ఎంట్రీ మరియు ఎగ్జిట్ లలో అన్ని మూసివేసి ఒక చోట మాత్రం తెరిచి ఉంచారు. అక్కడ కట్టడిగా కాలనిలో వచ్చే ప్రతి వాహనం యొక్క నెంబర్ , వారి వివరాలు ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేస్తున్నారు. కాలనిలో సుమారుగా 5000 మంది ఉన్నట్లు కాలనీ వాసి వనం వెంకట్ తెలిపారు. తమ కాలనీ ఆరంజ్ జోన్ లో ఉంది అని బయటి వారిని ఎవ్వరిని కూడా తమ కాలనిలో రానివ్వడం లేదని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర పాసులు ఉన్నవారిని అనుమతి ఇస్తున్నట్ట్లు తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అలాగే తమని తాము స్వీయ నిర్బంధలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమాలు పాటిస్తునట్టు తెలిపారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా సహకరిస్తున్నారు అని అన్నారు.