లక్షకు చేరువలో కరోనా కేసులు ఎక్కడో తెలుసా ?

విశ్వాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా ఆ దేశాన్ని కూడా వదలలేదు. రోజు రోజుకి అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రష్యాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,411 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 93,558కు చేరింది. ఒకరోజులో గరిష్టంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 867మంది కరోనా వల్ల చనిపోయారు. గత వారం రోజుల నుంచి ప్రతిరోజు సగటున ఆరువేల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ఎక్కువగా కరోనా బాధితులున్న దేశాల జాబితాలో రష్యా ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ వారంలోనే కేసుల సంఖ్యలో చైనా, ఇరాన్‌లను రష్యా దాటేసింది. రష్యా సైన్యంలో ఇప్పటి వరకు 874 మంది సిబ్బందికి కరోనా సోకింది అక్కడి అధికారులు తెలిపారు.