ఏపీ లో ముదురుతున్న రాజకీయాలు
ఒక వైపు కరోనా కేసులు , మరణాల మీద అంతా మాట్లాడుతుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. మీరు రెడ్ జోన్ లో తిరుగుతున్నారు అంటే మీరు కరొనకు స్లీపర్ సెల్స్ గా మారారు అంటూ మతాల యుద్ధం చేస్తున్నారు. కరోనాని ఎలా కట్టడి చేయాలో పక్కన పెట్టి వారు ఇప్ప్డుడు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీవీ ఇంటర్వూస్ , డిబేట్స్ లో వారు అసలు విషయం పక్కన పెట్టి ఎన్నికలు , బర్త్ డే పార్టీలు , రెడ్ జోన్ లలో కూరగాయల పంపిణి ఇలాంటి విషయాలపై చర్చ చేస్తున్నారు . ఇప్పుడు ప్రజలకు కావల్సినది ఏందీ , ప్రతిపక్షంగా టీడీపీ చేస్తున్న పని ఏంటి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి కోసం ప్రభుత్వం ఏమి పని చేస్తుంది అనే అంశాలు పక్కన పెట్టి రాజకీయానికి సమయం కాదు అని ప్రజల అభిప్రాయం. మంత్రి మోపిదేవి వెంకటరమణ స్లీపర్ సెల్స్ అనే పదం వాడడం వల్ల ఎప్పుడు ఏపీలో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఈ విషయం పై టీడీపీ నేత దేవి నేని కూడా ఘాటుగానే బదులిచ్చారు. మరో వైపు రోజా కూడా ఒక టీవీ ఛానెల్ లో కరోనా విషయం పై కాకుండా రాజకీయాలపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.