ఎమర్జెన్సీ పాస్ తీసుకొని ఆ పని చేసిన ఘనుడు
దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంటే… మధ్యప్రదేశ్ లో ఓ ఘనుడు పోలీసుల , ఇతర అధికారుల కళ్ళు గప్పి ఆ పని చేసేసాడు. కరోనా తో దేశం విలవిలాడుతుంటే … వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసింది. గుట్కా, పొగాకుతో సహా మాదకద్రవ్యాల అమ్మకాలను నిషేధించారు. అయితే ఇప్పటికీ కొంతమంది ఈ ఉత్పత్తులను దొంగచాటుగా విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. లాక్డౌన్ కొనసాగుతుండగా పొగాకు ఉత్పత్తులను అమ్మినందుకు విదిషాకు చెందిన ఒక వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యాపారి తన భార్యను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ కారణంతోనే ఆ వ్యాపారి పాస్ పొందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యాపారి పేరు రాధావల్లబ్ అగర్వాల్ అని డీఎస్పీ రిచా జైన్ చెప్పారు. లాక్‌డౌన్ ఉల్లంఘన, పొగాకు ఉత్పత్తుల చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు రిచా జైన్ తెలిపారు.