లాక్ డౌన్ లో పేదవారిని ఆదుకుంటున్న కీసర ఉపసర్పంచ్
ఒక వైపు లాక్ డౌన్ , మరో వైపు పేదల ఆకలి పోరాటం. ఇది ఇప్పుడు కనిపిస్తున్న జీవితం. కీసర గ్రామంలో ఇలాంటి ఘటనలు చూసి చలించిన కీసర ఉప సర్పంచ్ కందాడి బాలమణి పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి చేసింది. తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీసర గ్రామంలో పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కందాడి ప్రభాకర్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. గోధుమపిండి , నూనె , చక్కర , సబ్బులు లతో పాటు మరి కొన్ని సరుకులు పంపిణి చేసారు.