ఆ దేశంలో ప్రాంభమైన పాస్ పోర్ట్ సేవలు

ఆ దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు చేసింది. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్, అటెస్టేషన్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గి, నిషేధాజ్ఞలు సడలించిన షార్జా, ఖలీజ్ సెంటర్, బీఎల్ఎస్ డెయిరా, రాస్ అల్ ఖైమా, ఫజైరా ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా పాస్‌పోర్ట్ గడువు ముగిసిపోయిన వారు రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాస్‌పోర్ట్ గడువు చివరి తేదీ మే 31గా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించింది. [email protected] ద్వారా అపాయింట్మెంట్‌ను బుక్ చేసుకోవాలని తెలిపింది. అత్యవసర సేవలకు [email protected] ద్వారా సంప్రదించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పాస్‌పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.